- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గజ్వేల్ హత్య కేసు.. లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై ఉక్కుపాదం: పోలీసుల హెచ్చరిక
రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై రాష్ట్ర ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (పీఎస్‌ఏఆర్‌ఏ) ద్వారా చర్యలు చెపట్టినట్లు ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై రాష్ట్ర ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (పీఎస్‌ఏఆర్‌ఏ) ద్వారా చర్యలు చెపట్టినట్లు ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక హత్య కేసులో, నిందితులుగా ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డుల ఉదంతం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గజ్వేల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న రంజిత్ పాండే, రితేష్ కుమార్ రాయ్ అనే గార్డులు కుతుబుల్లాపూర్ (మేడ్చల్-మల్కాజిగిరి) కేంద్రంగా పనిచేస్తున్న సంపద ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ' ద్వారా నియమించబడ్డారని పేర్కోన్నారు. విచారణలో సదరు ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేదని తేలిందని పేర్కోన్నారు. ఆ సంస్థ యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా సెక్యూరిటీ ఏజెన్సీలను నడిపేవారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ.25 వేల వరకు జరిమానా, లేదా రెండు విధించబడతాయని హెచ్చరించారు.
ప్రతి సెక్యూరిటీ గార్డు శిక్షణ పొంది ఉండాలి
2026 సెక్యూరిటీ ఏజెన్సీల నిబంధనలు, మార్గదర్శకాలను వెల్లడించారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునే ముందు వారి ప్రవర్తన, పూర్వాపరాలను తప్పనిసరిగా పోలీసుల ద్వారా ధృవీకరించు కోవాలని సూచించారు. ఎటువంటి నేర చరిత్ర ఉన్న వారిని గార్డులుగా చేర్చుకోకూడదని పేర్కొన్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డు పీఎస్ఏఆర్ చట్టం ప్రకారం శిక్షణ పొంది ఉండాలని తెలిపారు. లైసెన్స్ లేని ఏజెన్సీలు వెంటనే అధికారిక వెబ్‌సైట్ www.psara.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిబంధనలు పాటించని డైరెక్టర్లు, ప్రొప్రైటర్లు భాగస్వాములపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.






