- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaddar Foundation: మీ ప్రభుత్వ అభిమానానికి కృతజ్ఞతలు.. సీఎంకు గద్దర్ ఫౌండేషన్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్, సెక్రటరీ జి.వి సూర్య కిరణ్ లేఖ రాశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గద్దర్ ఫౌండేషన్ (Gaddar Foundation) కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.3 కోట్ల నిధులు మంజూరు, గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలో గద్దర్ ఫౌండేషన్ కుభాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గద్దర్ ఫౌండేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్, సెక్రటరీ జి.వి సూర్య కిరణ్ (G.V Surya Kiran) లేఖ రాశారు. ప్రజావాగ్గేయ కారుడు అమరుడు గద్దర్ పట్ల మీ ప్రభుత్వం చూపుతున్న అభిమానానికి గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్ కు భాగస్వామ్యం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యావాదులు తెలిపారు. గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించి ఆయన సృష్టించిన కళా సంపదను ప్రజలకు అందించడానికి మీ నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుని రూ. 3 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, అలాగే 2014-2024 సంవత్సరాలకు గాను తెలంగాణ గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను (Gaddar Film Fare Awards) ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యావాలు తెలియజేశారు. మీ ప్రభుత్వ సహకారంతో గద్దర్ ఫౌండేషన్ సమర్ధవంతంగా గద్దర్ ఆశయ సాఫల్యం కోసం కృషి చేస్తుందని అందుకు తగు కార్యక్రమాలు నిర్వహిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. గద్దర్ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కు రూ. 3 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ఇటీవల నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలో గద్దర్ ఫౌండేషన్ కుభాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.






