2025 తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2026-03-07 06:11:41  IST  )

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల తుది జాబితాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జ్యూరీ సభ్యులు అందజేశారు.

2025 తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 2025 ఏడాదికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది.ఉత్తమ చిత్రంగా రాజ్ వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడులు రష్మిక ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవీకి ఎన్టీఆర్ అవార్డు వరించింది. ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు దక్కింది. కాంతారావు అవార్డు ఆర్ నారాయణ మూర్తి, బీఎన్ రెడ్డి అవార్డు సింగితం శ్రీనివాసరావు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్ కు వరించగా సినారె అవార్డు సుద్దాల అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేశ్ ప్రసాద్ ను ఎంపిక చేశారు.

భట్టితో జ్యూరీ భేటీ:

అంతకు ముందు జ్యూరీ 2025వ సంవత్సరానికి గానూ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ప్రజా భవన్‍లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు భట్టీతో భేటీ అయ్యారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, వేడుక నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు.

ఉత్తమ చిత్రం -రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ నటుడు-నాగ చైతన్య(తండేల్)

ఉత్తమ నటి -రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)

ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం -ది ఫ్రీ వెడ్డింగ్ షో

నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా-తండేల్

స్పెషల్ జ్యూరీ అవార్డులు:

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు -చిరంజీవి

పైడి జైరాజ్ అవార్డు- కమల్ హాసన్

సినారే అవార్డు-సుద్దాల అశోక్ తేజ

రఘుపతి వెంకయ్య అవార్డు -రమేశ్ ప్రసాద్

అక్కినేని నాగేశ్వరరావు అవార్డు -జయసుధ

నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్

బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు-సింగీతం శ్రీనివాసరావు

కాంతారావు అవార్డు-ఆర్.నారాయణమూర్తి

ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ సినిమా - కోర్ట్‌

ఉత్తమ డాక్యుమెంటరీ - యూనిటీ

ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం

బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ పరిచయ దర్శకుడు - సాయి మార్తాండ్‌ (లిటిల్‌ హార్ట్స్‌)

ఉత్తమ బాలల చిత్రం - అనగనగా

ఉత్తమ సహాయ నటుడు - శివాజీ

Next Story