- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaddar Awards: జూన్ 14న గద్దర్ అవార్డులు.. హెచ్ఐసీసీలో వేడుక
గద్దర్ అవార్డులను జూన్ 14న ప్రదోనోత్సవం చేయనున్నట్లు దిల్ రాజ్ వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల (Gaddar Awards) ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్ (Dil Raju) చెప్పారు. హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ జయసుధ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సినిమా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోత్సాహం:
కాంగ్రెస్ ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా ఉర్దు చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురైందన్నారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడే తెలుగు సినిమా పరిశ్రమను బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఆ సినిమాల ద్వారా సమాజానికి సందేశాలను అందించాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ గుండెచప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తంగా చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని తన పాటలతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. గద్దర్ పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయం అని హైదరాబాద్ నగరంలో జరగబోయే చలనచిత్ర అవవార్డుల ప్రదానోత్సవం గురించి ప్రతిచోట మాట్లాడుకునేలా గొప్పగా నిర్వహిస్తామన్నారు. అందుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. అవార్డుల కోసం ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా సినిమాల ఎంపిక ఉండాలని జ్యూరీని కోరారు. గద్దర్ అవార్డుతో వ్యక్తులుగా చలన చిత్రపరిశ్రమకు గొప్ప పేరు తీసుకువచ్చిన వారి పేరుమీద వివిధ అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఈ అవార్డులు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు.
పోప్ కు మౌనం పాటించి నివాళి:
క్యాథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్(88) మృతికి సంతాపంగా ఈ సందర్భంగా సభావేదికపై రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. పోప్ మరణంపై భారత ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.






