Cyber Crime : ఇకపై సోషల్ మీడియాపై నిఘా : శిఖా గోయల్

by Muthe.Rajitha |

ఇకపై సోషల్ మీడియా(Social Media)పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ(Cyber Security) పూర్తి నిఘా ఉంటుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్(DG Shikha Goeal) ప్రకటించారు.

Cyber Crime : ఇకపై సోషల్ మీడియాపై నిఘా : శిఖా గోయల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై సోషల్ మీడియా(Social Media)పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ(Cyber Security) పూర్తి నిఘా ఉంటుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్(DG Shikha Goeal) ప్రకటించారు. నేడు చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న పలువురిని నేడు సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ పోలీస్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో చైల్డ్ పోర్న్ వీడియోలు అప్లోడ్ చేస్తున్న కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ కు చెందిన 15 మందిని అరెస్ట్ చేసినట్టు శిఖా గోయల్ తెలిపారు.

ఈ నిందితులకు మరో 34 కేసుల్లో సంబంధం ఉందని, వీరంతా 19 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని.. కొంతమంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ పూర్తి దృష్టి పెడుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు.

Next Story