- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ నుంచి స్వయం ఉపాధి వరకు.. ఆంధ్రా మహిళా సభలో ప్రత్యేక శిక్షణ
మహిళలు ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం సాధించి స్వశక్తితో ఎదిగేందుకు ఆంధ్రా మహిళా సభ (డీడీఎంఎస్) ‘లిటరసీ హౌస్’ అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.

దిశ, సికింద్రాబాద్: మహిళలు ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం సాధించి స్వశక్తితో ఎదిగేందుకు ఆంధ్రా మహిళా సభ (డీడీఎంఎస్) ‘లిటరసీ హౌస్’ అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద ఉన్న ఏఎంఎస్ (AMS) అకడమిక్ క్యాంపస్‌లో.. మహిళలు, యువతుల కోసం ప్రస్తుత ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ స్కిల్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా ‘ప్లేస్‌మెంట్ అనుసంధాన కోర్సుల’ను రూపొందించడం విశేషం. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా నేరుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అందిస్తున్న ఉపాధి కోర్సులు ఇవే..
వివిధ రంగాలపై ఆసక్తి ఉన్న మహిళల కోసం లిటరసీ హౌస్ పలు విభాగాల్లో నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తోంది.
ఐటీ & కంప్యూటర్స్: కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, టాలీ ఈఆర్పీ9 అండ్ ప్రైమ్, జీఎఫ్ఎక్స్ (GFX) డిజైనింగ్, పైథాన్, పవర్ బీఐ, ఏఐ (AI) టూల్స్.
అపారెల్ & టైలరింగ్: బేసిక్ అండ్ అడ్వాన్స్‌డ్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జర్దోసీ, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగ్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్.
బ్యూటీ అండ్ వెల్నెస్: బ్యూటీషియన్, బ్రైడల్ ఆర్టిస్ట్, నెయిల్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్.
ఇతర కోర్సులు: డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పేపర్ బ్యాగ్స్ తయారీ, ఫైనాన్షియల్ లిటరసీ (ఆర్థిక అక్షరాస్యత).
ఉద్యోగ, స్వయం ఉపాధికి సంపూర్ణ సహకారం
కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ‘ప్లేస్‌మెంట్ లింక్డ్ సర్టిఫికేషన్’ అందజేస్తారు. ఉద్యోగ సాధనకు అత్యంత కీలకమైన రెజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానంపై ప్రత్యేక శిక్షణ (ఇంటర్వ్యూ ప్రాక్టీస్) ఇస్తారు. అనంతరం భాగస్వామ్య సంస్థల ద్వారా నేరుగా ఇంటర్వ్యూ అవకాశాలు కల్పిస్తారు. ఇతరుల వద్ద పని చేయడమే కాకుండా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు తమ వ్యాపార ఆలోచనలను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను, ఆర్థిక అక్షరాస్యతను అందిస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు.
సంప్రదించాల్సిన వివరాలు
ఈ ఉపాధి కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల మహిళలు నేరుగా కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. చిరునామా.. లిటరసీ హౌస్, ఆంధ్రా మహిళా సభ (ఏఎంఎస్ అకడమిక్ క్యాంపస్), ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద, హైదరాబాద్. ఫోన్ నంబర్లు: 62811 39282, 77319 31245, 99512 10441






