- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ కేసులో ట్విస్ట్.. మరో సెక్షన్ చేర్చిన పోలీసులు
మైనర్ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా.. కొత్తగా బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసిన సెక్షన్ ను కూడా చేర్చారు. BNS 64(2)(m) సెక్షన్ ను కూడా చేర్చారు. ఈ కేసులో భగీరథ్ పై నేరం రుజువైతే 10 ఏళ్లు జైలు శిక్ష, లేదా జీవితఖైదు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భగీరథ్ పై BNS 64 (2)(m), BNS 74, 75, POCSO సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్ లు నమోదయ్యాయి.
మే 8వ తేదీన బండి భగీరథ్ పై బాధితురాలి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్టీమ్ ను ఏర్పాటు చేశారు. కేసు నమోదైన వారంరోజులకు బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు రాగా.. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మరోవైపు పోలీసులు.. తామే అరెస్ట్ చేశామని చెప్పారు. మే 16న భగీరథ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద ఉన్న ఐఫోన్ 17 మొబైల్ ను స్వాధీనం చేసుకుని.. విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అమ్మాయితో అతను చేసిన చాటింగ్స్, మెసేజ్ లు, వీడియోలు, ఫొటోలతో పాటు.. సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చే కేసులో మరిన్ని నిజానిజాలు బయపడే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.






