అర్ధరాత్రి స్వేచ్ఛగా సైకిల్ రైడ్.. సోలార్ ట్రాక్‌పై యువతి.. స్పందించిన కేటీఆర్

by Ramesh Naini |   (  Updated:2025-12-03 16:11:57  IST  )

ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అర్ధరాత్రి స్వేచ్ఛగా సైకిల్ రైడ్.. సోలార్ ట్రాక్‌పై యువతి.. స్పందించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయతే, ఈ సైకిల్ ట్రాక్‌పై అర్ధరాత్రి సైకిల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నానంటూ పూణేకు చెందిన ఓ యువతి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తొలిసారి తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ రైడ్ చేయడం తనకెంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, వాతావరణం చాలా బాగుందని ఆమె వీడియోలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట దూసుకెళ్లింది.

ఈ సైకిల్ ట్రాక్ తమ సైకిల్ ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆనందకరమైన ప్రదేశంగా మారిందని, ఈ మేరకు ఇది ఏర్పాటు చేసిన కేటీఆర్‌కి థ్యాంక్యూ అంటూ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఈ వీడియోపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది చూడటానికి హృదయపూర్వకంగా ఉందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ, మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలగడమే గాంధీజీ కోరుకున్న నిజమైన స్వాతంత్య్రం అని పలువురు కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ పవర్‌లోకి రావాలని, ఇలాంటి నిర్మాణాలు మరెన్నో చేపట్టాలని నెటిజన్‌లు ఆకాంక్షించారు. కాగా, హైదరాబాద్ నార్సింగి పరిధిలో 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని 2023 అక్టోబర్ 1న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలో మొదటిది కావడం విశేషం. ట్వీట్ ఇదే..

Next Story