HYD: మహిళలకు మంచి అవకాశం

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక- ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో ఏప్రిల్ 7న మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, కౌన్సెలింగ్, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు.

HYD: మహిళలకు మంచి అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక- ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో ఏప్రిల్ 7న మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, కౌన్సెలింగ్, అవగాహన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ గర్భద్వార క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. నిమ్స్‌లోని రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, గైనకాలజీ విభాగాల నిపుణులు పాల్గొని సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. ఈ శిబిరం ద్వారా మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, నిపుణుల వైద్య సలహాలు, నివారణ చర్యలపై అవగాహన, లక్షణాలు, చికిత్సలపై మార్గదర్శనం చేయనున్నట్లు బీరప్ప తెలిపారు. రేడియేషన్ ఆంకాలజీ వేయిటింగ్ హాల్, నిమ్స్ ఆంకాలజీ బ్లాక్ లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తు గుర్తింపు ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలను పొందాలని డైరెక్టర్ పిలుపునిచ్చారు.

Next Story