Goup 1 : గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు : బీఆర్ఎస్ నేత ఆరోపణలు

by Muthe.Rajitha |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో(Group 1 Results) అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి(BRS Leader Rakesh Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.

Goup 1 : గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు : బీఆర్ఎస్ నేత ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో(Group 1 Results) అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి(BRS Leader Rakesh Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారిలో 40% మండి తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని, కాని వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో ఎందుకు లేరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షలు మొత్తం 46 కేంద్రాల్లో జరగగా కేవలం 2 కేంద్రాల్లోనే 72 మంది ఎలా టాప్ ర్యాంక్ పొందారో చెప్పాలని కమిషన్ ను డిమాండ్ చేశారు. అలాగే 25 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాప్ లో లేకపోవడం వెనుక గల మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు.

18, 19వ సెంటర్లలో కూడా ఏదో గోల్ మాల్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇవన్నీ నమ్మశక్యంగా లేవని.. వీటిపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి విచారణ జరిపించాలని అన్నారు. అప్పటి వరకు నియామక పత్రాలు అందజేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఒక్కరికి నష్టం జరిగినా అది అన్యాయమేనని.. తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని రాకేశ్ రెడ్డి సూచించారు.

Next Story