TG: ఎమ్మెల్యేలతో నలుగురు మంత్రుల కీలక చర్చ.. టాపిక్ ఏంటో తెలుసా?

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

TG: ఎమ్మెల్యేలతో నలుగురు మంత్రుల కీలక చర్చ.. టాపిక్ ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి & మౌలిక వసతులు – రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. సంక్షేమ పథకాలు – డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఆర్థిక సహాయం, రైతు రుణమాఫీ, పంటల నష్టపరిహారం, విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, మైనారిటీ & మహిళల అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షించారు. రాబోయే ప్రణాళికలు – యువత ఉపాధి అవకాశాలు, చిన్న & మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతు బజార్ల విస్తరణ, ఆరోగ్య రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుపైనా సుదీర్ఘంగా చర్చించారు.

Next Story