- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర శివారులో నాలుగు కిలోల బంగారం పట్టివేత
by Malleboina Mahesh |
రోజువారీ డ్యూటీ లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. భారీగా బంగారం పట్టుబడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోజువారీ డ్యూటీ లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. కాగా నింధితులు కోల్‌కతా నుంచి రోడ్డుమార్గంలో బంగారం తరలిస్తు పోలీసులకు పట్టుబడ్డారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా కార్లను చెక్ చేస్తుండగా.. కారు డిక్కీలో బంగారం దాచి తీసుకెళ్తున్న ముఠా గుట్టు బయట పడింది. దీంతో బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






