- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో నాలుగు రోజులు రాష్ట్రంపై పులి పంజా.. హైదరాబాద్‌లో చుక్కలే
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. కాగా మరో నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 నుండి 7 డిగ్రీలకు పడిపోతాయని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో 7 నుండి 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే గత పదిరోజులుగా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కనిపిస్తోంది. అయితే రాబోయే నాలుగు రోజులు మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చలి తీవ్రత పెరిగితే వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువ ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






