- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీటీఓ నూతన భవనానికి శంకుస్థాపన.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ రవాణా సంస్థ (పీటీఓ) ప్రాంగణంలో నూతన పీటీఓ భవన నిర్మాణానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ రవాణా సంస్థ (పీటీఓ) ప్రాంగణంలో నూతన పీటీఓ భవన నిర్మాణానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రభుత్వం రూ.59 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు డీజీపీ తెలిపారు. అధునాతన భవనంలో వర్క్‌షాప్‌లు, డయాగ్నస్టిక్ సిస్టమ్స్, మెయింటెనెన్స్ బ్లాక్‌లు, ఆపరేషన్ జోన్‌లు ప్రత్యేక శిక్షణా మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకొనున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
టీజీ పోలీస్ సంక్షేమ ఫ్యూయల్ ఔట్‌లెట్ కూడా ప్రారంభించారు. ఔట్ లెట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో పోలీస్ రవాణా సంస్థ ఐజీపీ, టీజీపీఐసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎం. రమేష్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఎస్పీ పీటీఓ రాజేష్ , ఐఓసీఎల్, ఈడీ పీయూష్ మిట్టల్, సీజీఎం బద్రీనాథ్, ముత్తు కుమరన్, సుదీప్తో మిత్ర పాల్గొన్నారు.






