- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ వాట్సాప్ హ్యాక్
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి ప్రజలను ట్రాప్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ వాట్సాప్ నెంబర్‍ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తనకు డబ్బులు అర్జంట్‍గా అవసరం ఉందని వేదకుమార్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. తాను ఎప్పుడు ఉపయోగించే యూపీఏ నంబర్ పని చేయడం లేదని 6202756958 నంబర్‍కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా అత్యవసరంగా రూ.60 వేలు పంపించాలని మెసేజులు పంపుతున్నారు. కాగా ఈ సైబర్ చీటర్ల పనే అని గ్రహించిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని స్క్రీన్ షార్ట్ తీసి మిగతా వారికి పంపి అప్రమత్తం చేశారు. కాగా గతంలో ఓటీపీలు, డిజిటల్ అరెస్టుల పేరుతో రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు తాజాగా అధికారులు, రాజకీయ నాయకుల వాట్సాప్ నెంబర్లను హ్యాక్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పలువురు కేబినెట్ మంత్రులకు చెందిన మీడియా వాట్సాప్ గ్రూప్ లు ఇలా హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే.






