caste census: కులగణన అభినందన.. సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి భేటీ

by Ramesh Naini |   (  Updated:2025-02-17 10:04:20  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ సహాయ మంత్రి అరుణ్ సుభాష్ చంద్రయాదవ్ భేటీ అయ్యారు.

caste census: కులగణన అభినందన.. సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ సహాయ మంత్రి అరుణ్ సుభాష్ చంద్రయాదవ్ (Arun Subhash Chandra Yadav) భేటీ అయ్యారు. (caste census) సమగ్ర కుల సర్వే నిర్వహించి, ఓబీసీల సాధికారత కోసం డేటాను ఉపయోగించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని అభినందించడానికి సోమవారం సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

(Telangana) కులగణన చారిత్రాత్మక నిర్ణయమని అఖిల భారత ఓబీసీల సంఘం, మధ్యప్రదేశ్‌ ఓబీసీ, ఎంపీ యాదవ సమాజం తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా, సీఎం రెడ్డి ఓబీసీ సాధికారతలో దేశం మొత్తానికి రోల్ మోడల్‌గా నిలిచినందుకు అనేక మంది ప్రముఖ ఓబీసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు అభినందిస్తున్నారని కొనియాడారు.

Next Story