తెలంగాణ మాజీ సీఎం KCR కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మాజీ సీఎం KCR కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వేదికగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు ఉద్యమ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌కే తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. మన చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో.. నీళ్లేవో తెలిసిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నట్లు KCR ప్రకటించారు.

కాగా, ఈనెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ‌ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. కేసీఆర్, హరీష్ రావు పిలుపు మేరకు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్‌లో నిర్వ‌హించే పార్టీ ర‌జ‌తోత్స‌వ‌ సభ స్థలిని పరిశీలించారు. ప్రతి గ్రామం నుంచి సుమారుగా 100 మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Next Story