- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chalo Assembly : రేపు మాజీ సర్పంచుల ఛలో అసెంబ్లీ
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ తో మాజీ సర్పంచ్ ల జేఏసీ(Former Sarpanchs JAC) రేపు సోమవారం అసెంబ్లీ ముట్టడికి చలో అసెంబ్లీ(Chalo Assembly) కార్యక్రమానికి పిలుపు నిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ తో మాజీ సర్పంచ్ ల జేఏసీ(Former Sarpanchs JAC) రేపు సోమవారం అసెంబ్లీ ముట్టడికి చలో అసెంబ్లీ(Chalo Assembly) కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ శాసన సభ సమావేశాల్లో పెండింగ్ బిల్లుల అంశంపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బిల్లుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. 2019నుంచి 2024వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం, గవర్నర్ సహా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదన్నారు. అందుకే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చలో అసెంబ్లీ చేపట్టామని, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లను ముందస్తు అరెస్టు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి తాజా మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గంటి మధుసూదన్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, జూకంటి బాలస్వామి, బీరప్ప పాల్గొన్నారు.






