- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం.. ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచులు
పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు తెలంగాణ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు తెలంగాణ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. తమకు సంబంధించిన రూ.531 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిస్తూ, అసెంబ్లీని ముట్టడికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు అసెంబ్లీ వైపు మాజీ సర్పంచ్‌లు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
మాజీ సర్పంచులు సర్పంచ్‌లు, పోలీసులకు మధ్య తోపులాటలో పలువురు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిరసనకు దిగిన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తోంది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను ఇప్పటికే ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.






