Ex MP: ప్రధాని మోడీకి ఎదురెళ్తే CM రేవంత్‌కే డేంజర్

by Gantepaka Srikanth |

తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

Ex MP: ప్రధాని మోడీకి ఎదురెళ్తే CM రేవంత్‌కే డేంజర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి అడ్డొచ్చినా.. రేవంత్ రెడ్డికే మోడీ అడ్డొచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుల అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ పెట్టుకుంటే మసైపోవడం ఖాయమని అన్నారు. మోడీ కాదు.. రాహుల్ ఇల్లీగల్ కన్వర్టెడ్ గాంధీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు.


కాగా, ‘ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పుట్టుకతో బీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. పుట్టుకతో ఉన్నత కులం. కానీ, 2002లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకున్నారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం(ఫిబ్రవరి 14, 2025) ఓ సభలో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు సమర్దిస్తుండగా.. బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు.

Next Story