- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vinod Kumar: దానికి మహారాష్ట్ర అంగీకరించదు
తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదని.. నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్‌లు అవసరమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదని.. నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్‌లు అవసరమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 152 మీటర్ల ఎత్తులో గోదావరి జలాల తరలింపునకు మహారాష్ట్ర అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా 152 మీటర్ల ఒప్పందాన్ని సాధించలేకపోయాయని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జల సౌధలో నిర్వహించిన సమీక్షలో ఓ మంచి మాట చెప్పారని.. వానాకాలం ముగియగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు మరమ్మతులు చేయిస్తామని ప్రకటించారని అన్నారు.
తాము మొదట్నుంచి మరమ్మతుల్లో ఆలస్యం ఎంత మాత్రం వద్దని చెబుతూనే ఉన్నామని చెప్పారు. ప్రాజెక్టులకు ఏం జరిగినా బాధ్యత ఓనర్‌దే అని ఎన్డీఎస్ఏ చట్టంలోనే ఉందన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ చేశారని.. మేడిగడ్డ మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అన్నారం, సుందిళ్లకు ఏం కాలేదని అన్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయని ప్రచారం జరుగుతున్నదని.. రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారా లేదా క్రాస్ చేయించారో తెలియదని అన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండాలని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.






