- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నోటీసుల్లో ఏముందో తెలియదు: మాజీ MP వినోద్‌కుమార్
కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసిందని.. నోటీసుల్లో ఏముందో తెలియదని.. తెలిసిన తర్వాత స్పందిస్తానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసిందని.. నోటీసుల్లో ఏముందో తెలియదని.. తెలిసిన తర్వాత స్పందిస్తానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే గొప్పగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నిర్మించుకున్నామని, కానీ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు కనిపించడం లేదో తెలియడం లేదని అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులను అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజాస్వామిక చరిత్రను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత చరిత్రను మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించాలని అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని.. జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ విజేతలు, పోటీదారులను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లే ముందు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం అమరజ్యోతిని చూపించాలని డిమాండ్ చేశారు.






