స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు : మాజీ ఎంపీ వినోద్ కుమార్

by Muthe.Rajitha |

పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు : మాజీ ఎంపీ వినోద్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని మండిపడ్డారు. స్వయంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారామని చెప్పినా, ఇప్పుడు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. పార్టీ పిరాయింపులపై ఉన్న 10వ షెడ్యూల్‌కు రాజ్యాంగ సవరణ చేయాలని, వెంటనే పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇవాళ ఇచ్చిన తీర్పుతో రాజీవ్ గాంధీ తెచ్చిన పార్టీ పిరాయింపుల చట్టాన్ని పనికిమాలినదిగా కాంగ్రెస్ పార్టీనే తేల్చిందని ఆరోపించారు. పార్టీ మారవచ్చు, కానీ స్పీకర్ దగ్గర పార్టీ మారలేదని చెబితే సరిపోతుందనే సందేశం ఈ తీర్పుతో వెళ్లిందని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీయే చంపేసిందని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

Next Story