తిరిగి దాడి చేయడానికి ఏమాత్రం ఆలోచించం.. సోయం బాపూరావు వార్నింగ్

by Gantepaka Srikanth |

ఆదివాసీ గిరిజనులపై దాడి చేయడం హేయమైన చర్యగా మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు అభివర్ణించారు.

తిరిగి దాడి చేయడానికి ఏమాత్రం ఆలోచించం.. సోయం బాపూరావు వార్నింగ్
X

దిశ, ఆసిఫాబాద్: ఆదివాసీ గిరిజనులపై దాడి చేయడం హేయమైన చర్యగా మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు అభివర్ణించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి.. వారిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆదివాసీ గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే మేము తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వాటికి పోలీసులు సహకరించొద్దని కోరారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండి.. జీవో నెంబర్ 49 రద్దు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివాసీ బిడ్డ తమకున్న హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందుకోసం భారత రాజ్యాంగాన్ని చదవాలని పిలుపునిచ్చారు. మరోసారి ఆదివాసీల వైపు కన్నెత్తి చూస్తే.. మా తడాఖా ఏంటో చూపిస్తామని ఫైర్ అయ్యారు.

Next Story