గిరిజనులకు కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయం చేస్తుంది : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

by Ramesh Naini |

తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, కొన్ని తెగలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తెలిపారు.

గిరిజనులకు కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయం చేస్తుంది : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో (tribals) గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, కొన్ని తెగలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ (Former MP Ravindra Naik) తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని, గిరిజనులు ఆరు గ్యారంటీలను సద్వినియోగం చేసుకుంటున్నారని రవీంద్ర నాయక్ ​తెలిపారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, గిరిజనుల కష్టాలను సోనియాగాంధీ గుర్తించిందన్నారు. 10 శాతం రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అమలు చేస్తున్నారని రవీంద్ర నాయక్​ చెప్పారు. లంబడాలను ఎస్టీ జాబితాలో చేర్చి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుతున్నామని, ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఎస్టీ జాబితాలో లంబడాలను చేర్చిన ఇందిరమ్మకు పుష్పాంజలి ఘటిస్తామని రవీంద్ర నాయక్​​తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Next Story