- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘షేమ్ షేమ్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి’
by GSrikanth |
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అధికార పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అధికార పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన గడ్డం సంతోష్ రెడ్డి అనే వ్యక్తిపై బీఆర్ఎస్ నేతలు దాడి చేసిన ఘటనను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు.
రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు హింసను ఆశ్రయించడం అంటే అది తమ పతనానికి ప్రారంభం అని బీఆర్ఎస్ పతనం ఖాయం అన్నారు. సంతోష్ రెడ్డిపై జరిగిన దాడిలో పోలీసులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒత్తిడి మేరకు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు షేమ్ షేమ్ వేముల ప్రశాంత్ రెడ్డి, షేమ్ షేమ్ తెలంగాణ పోలీస్ అంటూ శుక్రవారం రియాక్ట్ అయ్యారు.
Next Story






