- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు?
by GSrikanth |
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు, విమర్శలు చేసిందని.. సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు.
Next Story






