కేసీఆర్, కేటీఆర్‌కు సైనికుడిగా పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

కేసీఆర్, కేటీఆర్‌కు సైనికుడిగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రకటన చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌కు సైనికుడిగా పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్‌లో నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వాటిని నమ్ముద్దు. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తానే గువ్వల బాలరాజును పంపినట్లు, మిగతా ఎమ్మెల్యేలను పంపిస్తానంటూ కథనాలు వస్తున్నాయని.. అవన్నీ తప్పుడు వార్తలే అని పేర్కొన్నారు. గతంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఎన్నో ఉన్నత పదవులు ఆశ చూపారని.. ప్రజల కోసం తాను పార్టీ మారలేదని తెలిపారు.

రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. గతంలో బీజేపీ తరఫున వచ్చిన వారిని బహిరంగంగా ప్రపంచానికి పట్టించానని.. తన కొన ఊపిరి ఉన్నంతవరకు తాండూరు ప్రజా సేవే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహక మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని.. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని పేర్కొన్నారు.

Next Story