- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. ఇక్కడే ఉన్నా: పైలెట్ రోహిత్ రెడ్డి
తనను దుబాయిలో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోందని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: తనను దుబాయి(Dubai)లో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోందని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Tandoor former MLA Pilot Rohit Reddy) అన్నారు. తాను హైదరాబాద్ మణికొండ(Hyderabad Manikonda)లోని తన నివాసంలో ఉన్నానని ఆయన తెలిపారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. కొందరు కావాలనే ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాండూరు ప్రజలు చింతించాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. తాండూరు ప్రజానికి, స్నేహితులు, కార్యకర్తలకు మరోసారి శివరాత్రి(Sivarathri) శుభాకాంక్షలు చెతున్నానంటూ పైలట్ రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు.
నన్ను దుబాయిలో అరెస్ట్ చేశారని కొన్ని వార్త కథనాలు వస్తున్నాయి.. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు..
— Telangana Awaaz (@telanganaawaaz) February 26, 2025
హైదారాబాద్ మణికొండలోని నా ఇంట్లో ఉన్నాను..
తప్పుడు ప్రచారం నమ్మవద్దు..
తెలంగాణ ప్రజానీకానికి, తాండూరు నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు..
-తాండూర్ మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/BBxjKhZycT






