బీఆర్ఎస్‌కు BIG షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 13:06:10  IST  )

బీఆర్ఎస్‌కు BIG షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా

బీఆర్ఎస్‌కు BIG షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్‌(KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యతిరేక రాగం పాడుతుండటం, ఫోన్ ట్యాపింగ్ కేసులో, కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండటం గులాబీ నేతలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గువ్వల బాలరాజు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను మరింత గందరగోళానికి గురి చేస్తోంది. దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Next Story