మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేయించాలి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-19 15:50:10  IST  )

కరీంనగర్‌ నగర్​లోని మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని,

మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేయించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్‌ నగర్​లోని మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని, అలాగే గత పాలకుల పాత్రపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ నగరంలో మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనుల పేరుతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణం కోసం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని, ఇందుకు టూరిం శాఖ రూ. 100 కోట్లు , నీటి పారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు.

కాగా గత ప్రభుత్వకాలంలో ఈ రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులు చేపట్టడం, ఆ పనులను తన అనుచరులకు అప్పగించడంతో నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గుత్తేదారు నిర్లక్ష్యం వహించారని సీఎం రేవంత్​దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పనులు కూడా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారని, అయితే నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తున్నదని వెల్లడించారు. రివర్‌ ఫ్రంట్‌ పరిధిలో చెక్‌ డ్యామ్​లు నిర్మిస్తే వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అవి పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. చెక్‌ డ్యామ్​లు కొట్టుకపోయిన తరువాత కూడా రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసిందన్నారు. ఇలా ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, కావున మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని చాడ వెంకట రెడ్డి కోరారు.

Next Story