- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం పోయినా పొత్తు పెట్టుకునేది లేదు : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
by Muthe.Rajitha |
ప్రాణం పోయినా బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకునేది లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రాణం పోయినా బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకునేది లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండబోమని స్పష్టం చేసారు. బీజేపీ తెలంగాణకు పనికి వచ్చే పార్టీనే కాదని విమర్శించారు. ఆ పార్టీతో పొత్తు అంటూ వార్తలు రావడంతో గతంలో కేసీఆర్ తమపై మండిపడ్డారని తెలిపారు.
సీఎం రమేష్(CM Ramesh) పార్టీ బీజేపీ అయినా.. ఆయన చంద్రబాబుకు నమ్మిన బంటు అనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. అయితే ఆయనను బెదిరించి కాషాయ పార్టీలోకి తీసుకు వచ్చారని, అలాంటి నీతి, న్యాయం లేని బ్రోకర్ చెప్పే మాటలు పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నానని వెల్లడించారు.
Next Story






