కేసీఆర్ చెబితేనే పెళ్లి చేసుకున్నా.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 15:28:16  IST  )

కేసీఆర్ చెబితేనే పెళ్లి చేసుకున్నా.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ చెబితేనే పెళ్లి చేసుకున్నా.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2001లో టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత నన్ను హైదరాబాద్‌లో ఉండాలని కేసీఆర్(KCR) అడిగారు. వీలైతే ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పారు. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. కేసీఆర్ నాకు పెళ్లి అయింది అనుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవాలని అన్నారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు.. హైదరాబాద్‌లో ఉండటానికి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను. అప్పుడు కేసీఆర్.. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగిపోవాలి. పెళ్లి చేసుకోకుండా జీవితం సంపూర్ణం కాదు అన్నారు. నేను చాలా సేపు ఆలోంచి.. ఇక పెళ్లి సంబంధాలు చూడండి అని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. లేకపోతే.. నా పెళ్లి అయ్యేసరికి ఇంకొంత లేట్ అయ్యేదేమో’ అని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story