మేము కాదు.. రేవంత్‌ కుర్చీ లాక్కునేది ఆ మంత్రే: మాజీ మంత్రి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) హాట్ కామెంట్స్ చేశారు.

మేము కాదు.. రేవంత్‌ కుర్చీ లాక్కునేది ఆ మంత్రే: మాజీ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఐదేళ్లు పాలిస్తేనే ప్రజలకు వాస్తవం తెలుస్తుందని.. కేసీఆర్ ఏంటో అప్పుడు అర్ధం అవుతుందని అన్నారు. బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌(NVSS Prabhakar) మాటలతో తమకు సంబంధం లేదని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే తామూ కోరుకుంటున్నామని అన్నారు. రేవంత్‌ రెడ్డికి ఆయన సొంత పార్టీ నేతలతోనే సమస్య ఉందని.. ముఖ్యంగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నుంచి త్రెట్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఐదేళ్లు పాలించాలని కేసీఆర్‌ అన్నారు. తాము కూడా అదే కోరుకుంటున్నామని గంగుల కమలాకర్ అన్నారు.

కాగా, ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతోందంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలిస్తే తమకేం వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Next Story