- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను అవమానించారు.. ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ఫైర్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్(KCR) చావును కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్(KCR) చావును కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) సీరియస్ అయ్యారు. శనివారం ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మూడు గంటల సీఎం స్పీచ్‌లో స్పష్టత ఇవ్వలేదు అన్నారు. అసెంబ్లీలో సీఎంకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో ప్రతిపక్ష నేతకు ఛాంబర్ కేటాయించలేదు. ఛాంబర్ లాక్కొని కేసీఆర్‌ను అవనించారని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్‌గా పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ., ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాటిచ్చారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 450 రోజులు గడుస్తున్నా హామీలు అమలు కావడం లేదని అన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) రుణమాఫీ(Runa Mafi)పై నియోజకవర్గాల వారిగా నివేదిక చదువుతూ అబద్దాలు చెప్పారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతల్లో రూ.29 వేల కోట్లు రుణమాఫీ చేసింది. మీరు నాలుగు విడతల్లో చేసింది రూ.21 వేల కోట్లు మాత్రమే.. నా నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రుణమాఫీ కంటే ఎక్కువ మీరు ఇచ్చి ఉంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా ఇది భట్టి విక్రమార్కకు నా సవాల్ అని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
Read More..






