సర్పంచ్ ఎన్నికలు అవ్వగానే స్టార్ట్ చేస్తాం.. మాజీ మంత్రి తలసాని ప్రకటన

by Gantepaka Srikanth |

సర్పంచ్ ఎన్నికలు అవ్వగానే స్టార్ట్ చేస్తాం.. మాజీ మంత్రి తలసాని ప్రకటన

సర్పంచ్ ఎన్నికలు అవ్వగానే స్టార్ట్ చేస్తాం.. మాజీ మంత్రి తలసాని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో తలసాని పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలు అవ్వగానే మన బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్ ఉంటుంది.. మెంబర్ షిప్ డ్రైవ్ అవ్వగానే కమిటీలు వేసి, యువజన విభాగం, మహిళా విభాగంతో అన్ని కమిటీలు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారికే అధ్యక్ష పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని స్పష్టం చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు.. కానీ అది సాధ్యపడలేదు.. కేటీఆర్ విదేశీ పర్యటన కారణంగా ఆలస్యం జరిగింది. దీంతో లోకల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయిందని తలసాని వెల్లడించారు. మరోవైపు.. అన్ని స్థాయిలలో ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి పార్టీ నాయకత్వం నమోదు కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం.

Next Story