Talasani: నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాలెంజ్

by Ramesh Naini |

కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ. 4 వేల కోట్ల అభివృద్ధి జరిగింది అని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు.

Talasani: నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ. 4 వేల కోట్ల అభివృద్ధి జరిగింది అని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భాష ఇప్పటికైనా మార్చుకోవాలని, ఆయనకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని అంటున్నారు.. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారా..? లేక వేరే దేశంలో ఉన్నారా..? అని సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ డిమాండ్‌తోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి పాలన పై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. అమీర్‌పేట్‌కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని అని, ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటం లేదని, బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అంటే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా అని మరోసారి ఛాలెంజ్ చేశారు.

Next Story