Srinivas Goud: మామూలుగా కాదు.. పులిలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-25 16:11:02  IST  )

Srinivas Goud: మామూలుగా కాదు.. పులిలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు

Srinivas Goud: మామూలుగా కాదు.. పులిలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచులకు సీఎం ఏం సందేశం ఇచ్చారని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సర్పంచుల సన్మాన సభలో రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడారని.. ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష ఇదేనా అని నిలదీశారు. ఆయన భాషను వింటుంటే అసహ్యంగా ఉన్నదన్నారు. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని.. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే.. 42 శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఆవేదన, ఆక్రోశం సభలో బయటపడిందని అన్నారు. తలుపు పెట్టుకుని ఏడ్చి రేవంత్‌రెడ్డి మీటింగ్‌కు వచ్చినట్లున్నారని.. అందుకే తొండల సోకు, లాగుల సోకు పట్టుకున్నదన్నారు.

పాలమూరు-రంగారెడ్డి అంశాన్ని డైవర్ట్ చేసి బూతులు మాట్లాడారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా మహిళల వద్దకు వచ్చి రూ.2,500 వస్తుందా లేదా అడగాలని సవాల్ విసిరారు. రేవంత్‌ను సీఎం పదవి నుంచి దింపిన తర్వాతనే పులిలా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అన్నారు. మిమ్మల్ని లాగులో తొండలు విడిచి రైతులు కొడతారని హెచ్చరించారు. సీఎం భాష చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని.. మంత్రులు,ఎమ్మెల్యేల అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేక కేసీఆర్‌పై బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ఆరు గ్యారెంటీ అమలయ్యాయో చూపించాలని డిమాండ్ చేశారు.

Next Story