- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinivas Goud: తప్పుల తడకగా కులగణన నివేదిక
ప్రభుత్వ ప్రకటించిన కులగణన నివేదిక తప్పుల తడక అని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ప్రకటించిన కులగణన నివేదిక తప్పుల తడక అని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారని పేర్కొన్నారు. తమ అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుందని.. ఓటర్లు 3 కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారని అన్నారు. బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ దగ్గర సర్వే కాలేదని అంటున్నారని ఆరోపించారు.
2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్లు చూపించారని తెలిపారు. 4 వేల పేజీల నివేదికపై ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రిపేర్ కావాలని.. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీతో మాట్లాడి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ట్యాబ్‌లు ఇస్తే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. తెలంగాణలో మరో బీసీ ఉద్యమం తప్పదని అన్నారు.






