బీజేపీలో చేరిన మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుశ్మిత

by Disha Web Desk 2 |
బీజేపీలో చేరిన మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుశ్మిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుశ్మిత కాషాయతీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమె కమలం పార్టీలోకి జాయిన్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ సునీల్ బన్సల్, ఎంపీ లక్ష్మణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి శంకర్ రావు షాద్ నగర్‌తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలందించారు. సికింబ్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగి సాయన్నపై గెలుపొందారు.

యూకేలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన సుశ్మిత ఇంటర్నేషనల్ లీడర్ షిప్ మేనేజ్ మెంట్, ఎల్ ఎల్ బీ విద్యను సైతం అభ్యసించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ చైర్ పర్సన్ గా ఆలయాన్ని అభివృద్ధి చేసి రూ.60 లక్షల ఆదాయం వచ్చే ఆలయాన్ని ఏడాదికి రూ.4.50 కోట్ల ఆదాయం వచ్చేందుకు ఆమె తీవ్రంగా కృషిచేశారు. ఇదిలా ఉండగా ఆమెతో పాటు బీఆర్ఎస్ నేతలు గోవింద్ రాఠీ, మనోజ్ సైతం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఇన్నిరోజులు బ్రేక్ పడిన జాయినింగ్స్ మళ్లీ తిరిగి ఊపందుకున్నాయి.



Next Story