- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాదనలే లేనప్పుడు దూషణలే ఆయుధం: సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఆయన పదవీకే కళంకం తెచ్చేవిగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఆయన పదవీకే కళంకం తెచ్చేవిగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. వాదనలో పసలేనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము, ధైర్యం లేనప్పుడు, దిక్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమే వస్తాయని తెలిపారు. పాలన చేతకాక, రియల్ ఎస్టేట్ ప్రమోటర్‌గా, ప్రజా సమస్యలపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీల అమలు చేయకుండా, ప్రతిపక్షానికి ప్రజాధారణ పెరుగుతుంటే తట్టుకోలేక, ప్రజల నిలదీతకు సమాధానం చెప్పలేక, సర్పంచ్ ఎన్నికల్లో చతికిల పడినపుడు వచ్చేవి ఇలాంటి పనికిమాలిన మాటలే అని తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి అసభ్య, అప్రజాస్వామిక రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని అన్నారు. అహంకారం పెరిగిపోయి, దిగజారి ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. కేసీఆర్ శిఖరం లాంటీ వారు.. ఇంకో వంద మంది మీ లాంటోళ్ళు వచ్చి అరిచినా కేసీఆర్ చరిత్ర చెక్కు చెదరదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచి ఉంటారని, కేసీఆర్ సుదీర్ఘ రాజకీయంలో వరుస విజయాలు సాధిస్తూ, తనని తాను తగ్గించుకొని, వ్యవస్థను హెచ్చించుకుంటూ ముందు నడిచారు కాబట్టే, వ్యవస్థ కూడా ఆయన పోరాటానికి తలొంచి ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు, అదే రాష్ట్రంలో కేసీఆర్‌ని అవమానించి చిన్నదిగా చేసి చూపించాలన్న మీ ప్రయత్నమే మిమ్మల్ని పాతాళానికి తొక్కుతుంది ముఖ్యమంత్రి అంటూ హితువు పలికారు.






