- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనతో నాకున్న అనుబంధం ఎలాంటిదంటే.. రామోజీ రావు మరణం తీరని లోటు.. మాజీ మంత్రి రోజా
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించారు.

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా ఆయకు సీని ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. అలానే రామోజీరావుతో తమకున్న అనుబంధం గురించి తెలుపుతూ.. ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రామోజీ రావు మరణంపై మాజీ మంత్రి ఆర్కే రోజా X వేదికగా స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ అలానే టీవి రంగంలో విప్లవాత్మక మార్పుకు విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు, వారి సంస్థ ఉషాకిరణ్‌లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట నవ్వులు పూయించిన టీవిషో జబర్దస్త్ వరకు వారితో ఉన్న నా అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. Rip Sir అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
- Tags
- ramoji rao






