Ravindra Naik: కేసీఆర్‌ను జైలుకు పంపించండి.. ఆలస్యం చేయకండి

by Gantepaka Srikanth |

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేసిన అవినీతిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, జైలుకు పంపించాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్(Ravindra Naik) డిమాండ్ చేశారు.

Ravindra Naik: కేసీఆర్‌ను జైలుకు పంపించండి.. ఆలస్యం చేయకండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేసిన అవినీతిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, జైలుకు పంపించాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్(Ravindra Naik) డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను జైలుకు పంపించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎలాంటి డిలే చేయొద్దని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. మాజీ సీఎం అవినీతిపై కాగ్ లాంటి నిఘా సంస్థలతో పాటు ప్రధాని మోడీ కూడా ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలన్నారు. పదేండ్లలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై చర్యలు తీసుకుని ఆ సంపాదనను రికవరీ చేయాలని, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ సీఎంను కోరారు.

Next Story