- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధన్వాడ రైతులపై ప్రభుత్వ దౌర్జన్యం దారుణం: మాజీ మంత్రి
by Gantepaka Srikanth |
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై ప్రభుత్వ దౌర్జన్యం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై ప్రభుత్వ దౌర్జన్యం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇథనాల్ పరిశ్రమ స్థాపించమబోమని రైతులకు హామీ ఇచ్చి.. మళ్లీ అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించడం రైతులను, ప్రజలను మోసం చేయడమే అని తెలిపారు. ప్రభుత్వ మోసాన్ని ప్రశ్నించిన రైతులు, రైతు కుటుంబాలపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా.. 40 మంది రైతులను అదుపులోకి తీసుకుని.. 12 మందిపై కేసులు పెట్టి రిమాండుకు పంపడం దుర్మార్గమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరిస్తామని.. భవిష్యత్తులో కాంగ్రెస్ కుటిల నీతికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Next Story






