- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: కృష్ణా జలాలను తన్నుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ చోద్యం.. ఏపీ ఇష్టారాజ్యం.. యథేచ్చగా కృష్ణా జలాలు తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Krishna Water Dispute) కాంగ్రెస్ చోద్యం.. ఏపీ ఇష్టారాజ్యం.. యథేచ్చగా కృష్ణా జలాలు తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించిందని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు.. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ నిలువరించ లేదని తెలిపారు. నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకు పోతున్నా చలనం లేని బోర్డు.. నోరెత్తని రేవంత్ సర్కారు అంటూ ఆరోపించారు.
కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను (KCR) కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే.. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో.. కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా అన్నింటిని గంగలో కలుపుతుందని తెలిపారు. వచ్చేది వేసవి.. తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్నముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసు? అని నిలదీశారు. కేఆర్ఎంబీ పరిధిలోని త్రీ మెన్ కమిటీ దిక్కులేదు.. సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీమ్మకు నీరెత్తినట్టున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు.






