- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR : ఎందాకైనా కొట్లాడుదాం! బెటాలియన్ కానిస్టేబుల్‌కు ఫోన్‌లో కేటీఆర్ భరోసా
దిశ, డైనమిక్ బ్యూరో: ఆత్మహత్యకు యత్నించిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR ఫోన్ చేసి భరోసానిచ్చారు. సమస్యలపై గళమెత్తిన పాపానికి ప్రభుత్వం తనపై కక్షగట్టి సర్వీస్ నుంచి తొలగిస్తే.. ఎందాకైనా ధైర్యంగా కొట్లాడదామని కేటీఆర్ ధైర్యమిచ్చారు. తన కుటుంబానికి సైతం అండగా ఉంటామని కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని 3వ బెటాలియన్‌లో పనిచేస్తున్న battalion constable కానిస్టేబుల్ నాగేశ్వర్‌రావు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం సృష్టించింది. సెలవు ఇవ్వాలని మంగళవారం అధికారులను కోరగా నిరాకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేటీఆర్ బుధవారం ఆ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.