- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ జయశంకర్.. మాజీ మంత్రి కేటీఆర్ నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) 90వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) 90వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.
తెలంగాణ భావజాల వ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్ (KCR) వెన్నంటే ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది అని అన్నారు. అందుకు తెలంగాణవాదులంతా కంకణబద్ధులై ఉంటారని ఆశిస్తూ.. జోహార్ జయశంకర్ సార్.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






