- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. రేపు జగిత్యాలలో కేటీఆర్‌తో కీలక భేటీ
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ కాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటచేసుకోబోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేటీఆర్ ఇవాళ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అంశాలపై చర్చించినట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం కేటీఆర్ స్వయంగా జగిత్యాల (Jagithyal) వెళ్లనున్నారు. అక్కడ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, గత కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు భారీ బలం చేకూరుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.






