Jagadish Reddy: తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ(Congress Party) నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని బీఆర్ఎస్(BRS) నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.

Jagadish Reddy: తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని బీఆర్ఎస్(BRS) నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కనిపించకుండా చేయడం కాంగ్రెస్ నాయకత్వ దివాళకోరుతనానికి నిదర్శనం అని విమర్శించారు. గతంలో ఇదే రకంగా తెలంగాణ భాష(Telangana Language)ను అవమానపరిచారని అన్నారు. ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని గుర్తుచేశారు.

తెలంగాణ తల్లి(Telangana Thalli) అంటే దేవతామూర్తితో సమానం అని అన్నారు. ఉద్యమ చరిత్రలో మరువలేని రోజు నవంబర్ 29 అని మరోసారి గుర్తుచేశారు. కేసీఆర్(KCR) దీక్ష భూని.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అన్న మాటే కోట్లాదిమందిని కదిలించిందని అన్నారు. రాబోయే రోజుల్లో రాబోయేది మళ్లీ కేసీఆర్ పాలనేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ పేగు బంధం. అభివృద్ధి, సంక్షేమాలే అజెండాగా వెళ్లామని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని పేర్కొన్నారు.

Next Story