- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: నిరుద్యోగుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం.. నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే: హరీశ్‌రావు డిమాండ్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్, అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని (unemployed people) నిరుద్యోగులు శుక్రవారం తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదిక మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం "హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్" కు పిలుపు ఇచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని తెలిపారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






